రాష్ట్రంలో 20 వనమిత్ర బహుళ అటవీ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చీఫ్ కన్జర్వేటర్ మల్లికార్జున రావు తెలిపారు.  మంగళవారం కడప జిల్లా మద్దిమడుగు సమీపంలోని సెంట్రల్‌  నర్సరీలో వనమిత్ర బహుళ అటవీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కేంద్రానికి వచ్చే పిల్లల కోసం ఆటబొమ్మలు, సందర్శనకు వచ్చే వారికి భోజన సదుపాయాలు కల్పిచడంతోపాటు  ఆహ్లాదకరమైన చెట్ల నీడన మొక్కల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తారనానరు. రాష్ట్రంలోని పది దేవాలయాల్లో పచ్చదనాన్ని పెంచి ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో కాశినాయిన మండలంలోని జ్యోతి క్షేత్రాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో లభించే ఎర్రచందనం సంరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నారు.  ఎర్రచందనం అక్రమ రవాణాపై చేసే స్మగ్లర్లపై దాడులు నిర్వహించి వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. డీఎఫ్‌వో నాగరాజు, ప్రసూన, రాజంపేట డీఎస్పీ ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు.