రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని 24వేల ఎకరాలకు సాగునీరు, 18గ్రామాలకు తాగునీరు అందించే ఉద్ధేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెలిగల్లు పథకం రూపుదిద్దుకుంది. పథకం పూర్తి చేసేందుకు రూ. 246కోట్లు వ్యయం చేశారు. 2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెలిగల్లు కోసం రూ. 16.5 కోట్లు వ్యయం చేసి ఎర్త్‌డ్యాం పనులను పూర్తి చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి వెలిగల్లు ప్రాజక్టును జలయజ్ఞం కింద చేర్చి రూ. 236కోట్లతో పనులు చేపట్టారు. 2008 డిసెంబరు 22వతేదీన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెలిగల్లు జలయజ్ఞం పనులకు శంఖుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి సోనియాగాంధి చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. పథకం నుంచి 0.30 టీఎంసీలు రాయచోటి ప్రజలకు తాగునీటి కోసం కేటాయించారు. 4.64 టీఎంసీ సామర్థ్యంతో వెలిగల్లు రూపుదిద్ధుకుంది. కుడికాల్వ 53.967 కిలోమీటర్లు. ఈకాల్వ ద్వారా 23.400 ఎకరాలకు సాగునీరు అందాలి. ఎడమ కాల్వ పొడవు 6.200 కిలోమీటర్లు. దీని ద్వారా 600 ఎకరాలకు సాగురు ఇవ్వాల్సి ఉంది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల సరిహద్దులో పాపాఘ్ని నదిపై వెలిగల్లు నిర్మించారు.