అన్నమయ్య ప్రాజెక్టుఅన్నమయ్య ప్రాజెక్టు నుంచి శుక్రవారం జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ నీరు విడుదల చేశారు.  ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డితో కలసి పూజలు చేసిన అనంతరం స్విచ్‌ ఆన్‌ చేసి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు ప్రాంతాలకు సాగు, తాగునీటి కోసం, భూగర్భ జలాల  అభివృద్ధికి నీటిని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఏప్రిల్ మే నెలల్లో నీటి సమస్య అధికంగా ఉండడంతో  ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. జూన్ పదో తేదీలోగా వర్షాలు కురిస్తే మన అదృష్టమని లేకుంటే అందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకొంటామన్నారు.  రైతులను ఆదుకునేందుకే అన్నమయ్య ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు.  నీటి విడుదల కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ రాజు, ఆర్డీఓ వీరబ్రహ్మం, ఇంజనీరింగ్‌ అధికారులు శ్రీనివాసులు, రమేష్, రాజశేఖర్‌రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు