ysrkadapa

వార్తలు

అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. ఆదివారం చాపాడు మండలం సోమాపురంలో సచివాలయ భవనం, ఎన్. ఓబాయపల్లెలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ పథకం అందాలన్న జన్మభూమి కమిటీ సిఫారసు అయ్యేదని, నేడు ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంతి అయ్యాక అర్హతే ప్రామాణికంగా తీసుకుని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని పథకాలలో టీడీపీ నాయకులే అధికంగా లబ్ధి కలుగుతుందోన్నారు. నియోజకవర్గ పరిధిలో గత రెండేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సీడీ రూ. 11 కోట్లు, పంటల బీమా రూ.30 కోట్లు మంజూరైందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 20 కరువు మండలాలు ఉండేవని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆపరిస్థితి లేదన్నారు. రైతులకు సాగుకు అవసరమైన నీటిని సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలో 26వేల మంది తల్లులకు రూ. 40 కోట్లు మంజూరు సోమవారం జమకానుందని వెల్లడించారు.