యోగాతో ఆయురారోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టరు హరికిరణ్‌ అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం మీకోసం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో  యోగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు.  21న కడపలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపంలో ఉదయం 7 గంటల నుంచి 8గంటల వరకు యోగాసనాలు చేయడం జరుగుతుందన్నారు. యోగాసనాలు నేర్చుకుని ప్రతిరోజూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్‌ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట్రామనాయక్‌, రిమ్స్‌ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎ.సుగుణమ్మ, రిమ్స్‌ వైద్యాధికారి హయత్‌, ఆయుర్వేద వైద్యాధికారులు జీవీ ప్రసన్నకుమార్‌, టి.రవికుమార్‌లు పాల్గొన్నారు.