వైఎస్సార్‌ జయంతి

వార్తలు
881 Views
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 8.50 గంటలకు డాక్టర్ వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రితో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, వైయస్ షర్మిల, ముఖ్యమంత్రి మామగారు డా.ఇ సి.గంగిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అరగంట పాటు ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు.

కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లతో సహా ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.

*** ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, తితిదే చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ రెడ్డి, మేడా వెంకటమల్లికార్జున రెడ్డి, ఎస్.రఘురామి రెడ్డి, ఎం. సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.-
డా.వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు స్వయంగా రచించిన నాలో నాతో వైఎస్సార్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ …. దివంగత మహా నేత ఒక గొప్ప వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా మహా నేతగా ప్రపంచానికి ఎంత తెలుసు. నాన్న తో కలిసి అమ్మ చేసిన సుదీర్ఘ ప్రయాణంలో… ఒక భర్తగా, పిల్లలకు తండ్రిగా, ప్రజలందరికీ అండదండలు అందించే మహానేత గా ప్రేమను పంచిన వ్యక్తిగా ఆమెకు తెలుసు. ఆమెకు తెలిసిన డాక్టర్ వైయస్సార్ ని ప్రజలందరికీ తెలియజేయాలని అమ్మ రాసిన మంచి పుస్తకం అని పేర్కొన్నారు.

వైఎస్ఆర్ జిల్లా కడప – త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ:
బుధవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత డాక్టర్ వైయస్సార్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ముఖ్యమంత్రి.

అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాల ను ఆవిష్కరించిన సీఎం. ఇందులో….

1) ఆర్‌జియుకెటి, ఆర్‌కె వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన క్రొత్త ఎకడెమిక్ కాంప్లెక్స్ ఆవిష్కరణ :

దీనిని ఎన్‌బిసిసి (ఐ) లిమిటెడ్ రెండు దశల్లో అమలు చేస్తోంది. ప్రస్తుతం మొదటి దశలో నిర్మాణం పూర్తి చేసిన 7 ECE, CSE, MME, EEE, కెమికల్, మెకానికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగ భవనాలు ఉన్నాయి. మరియు ఇందులో 4 సాధారణ భవనాలు. సెంట్రల్ లైబ్రరీ, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, క్యాంటీన్ మరియు లాండ్రీ ఉంటాయి.

రెండవ దశలో బాహ్య సేవల కల్పన ఉంటుంది. ఇందులో రోడ్లు, 475 కెఎల్‌డి మురుగునీటి శుద్ధి కర్మాగారం, 11 కెవి సబ్‌స్టేషన్, 75 కిలోవాట్ల సోలార్ పివి వ్యవస్థ, నీరు ట్రీట్మెంట్ ప్లాంట్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మరియు హార్టికల్చర్ పనులు ఉంటాయి.

2) రూ.10.10 కోట్ల అంచనాతో కంప్యూటర్ సెంటర్ కు సిఎం శంఖుస్థాపన చేశారు.

ఇందులో నాలుగు కంప్యూటర్ ల్యాబ్‌లు మరియు రెండు లెక్చర్ హాల్‌లు ఉంటాయి. 616 మంది కూర్చునే సామర్థ్యంతో మొత్తం 22150 చదరపు అడుగుల ప్లిన్త్ వైశాల్యంలో (0.75 ఎకరాలలో) విశాలమైన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ సెంటర్
నిర్మాణం చేపట్టడం జరుగుతోంది.

3) రూ. 40 కోట్లు అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డా. వైయస్ఆర్ ఆడిటోరియం నకు శంకుస్థాపన.

ఇది రెండు అంతస్థుల ప్రపంచ స్థాయి ఆడిటోరియం. 1700 మంది విద్యార్థులు సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం ప్లిన్త్ ఏరియా 75881.00 చదరపు అడుగులలో దీనిని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు M / s. వెన్సర్ కన్స్ట్రక్షన్స్ భాగస్వామ్యంలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది.

4) 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం.

ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన ఒక మెగావాట్ల సామర్థ్యం గల మూడు సౌర విద్యుత్ ప్లాంట్లను రెస్కో మోడ్ లో నెట్ మీటరింగ్ పథకం కింద ఏర్పాటు చేశారు.
NREDCAP మరియు M / s. వర్షిని ఎక్సిమ్ ప్రై. లిమిటెడ్
దీని నిర్మాణం చేపట్టారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా సున్నా పెట్టుబడితో RGUKT, RK వ్యాలీలో యూనిట్కు 7.66 రూపాయల నుండి 3.45 రూపాయల వరకు ఖర్చు తగ్గించబడుతుంది. తద్వారా సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ. 1.51 కోట్ల విద్యుత్ ఖర్చుని ఆదా చేస్తుంది.

** జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ ఎం గౌతమిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా కడపజిల్లాలోని ఇడుపులపాయలో నిర్వహించిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలివి.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *