ప్రజల ఆరోగ్య పరిరక్షనే ముఖ్యమంత్రి ధ్యేయం

వార్తలు
874 Views
ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. గురువారం స్థానిక కోటిరెడ్డి సర్కిల్ లో 104, 108 అంబులెన్స్ వాహనాలకు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌తో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర వైద్య సేవలను అందించే వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 104, 108 సర్వీసుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1088 అత్యంత అధునాతన సంచార వైద్య శాలలు, అంబులెన్స్ వాహనాలను బుధవారం విజయవాడ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. జిల్లాకు 104 వాహనాలు 51, 108 వాహనాలు 36 కేటాయించారన్నారు. అత్యవసర వైద్య సేవల కల్పనలో ఇది ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ , బేసిక్ లైఫ్ సపోర్ట్, నియో నేటల్ , వెంటిలేటర్స్ ..లాంటి అత్యంత ఆధునిక పరికరాలతో కూడిన 108 , 104 అంబులెన్స్ వాహన సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. గుండె జబ్బున్న పేషెంట్లకు అంబులెన్స్ లోనే అక్కడికక్కడే మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. అడ్వాన్స్ మానిటర్ సిస్టం ను కూడా ఇందులో సమకూర్చినట్లు తెలిపారు. ఒక్కొ మండలానికి ఒక్కొక్కటి చొప్పున 51 మండలాలకు 104 వాహనాలు, 108 అంబులెన్సు లకు సంబంధించి 36 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. పిల్లలకు సంబంధించి నియోనేటల్ లో మొట్టమొదటిసారిగా ఇంక్యు బేటర్లతో కూడిన వెంటిలేటర్ల వంటి ఆధునిక పరికరాలతో కూడిన రెండు వాహనాలను జిల్లాకు కేటాయించారన్నారు. అనారోగ్యంతో అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ వాహనం లో ప్రాథమిక వైద్యం ను అందించవచ్చునన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు 104, 108 అంబులెన్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఈనెల 1 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి కొవిడ్ పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారనానరు. 108 , 104 వాహనాల సిబ్బంది వేతనాలను పెంచారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 104, 108 అంబులెన్స్ వాహనాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఉందని అదేవిధంగా జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ వాహనాలన్నీ శుక్రవారం నుంచి అన్ని మండలాలలో అందుబాటులో ఉంటాయన్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ , బేసిక్ లైఫ్ సపోర్ట్, నియో నేటల్ , వెంటిలేటర్స్ ..లాంటి అత్యంత ఆధునిక పరికరాలతో కూడిన 108 , 104 అంబులెన్స్ వాహన సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నియోటెల్ కేర్ అంబులెన్సులతో మాతా, శిశు మరణాలు రేటును తగ్గించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్( డెవలప్మెంట్) సాయి కాంత్ వర్మ, ఆర్డీవో మలోలా, మున్సిపల్ కమిషనర్ లవన్న, డిఎంఅండ్హెచ్ఓ ఉమా సుందరి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రవీంద్ర నాథ్ రెడ్డి, 104, 108 వాహనాల జిల్లా మేనేజర్ ఇక్బాల్, తాసిల్దారు శివరామిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *