కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

వార్తలు
280 Views

రెండ్రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4.45గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ తో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జిల్లా ఎస్పీ అన్బురాజన్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్ సురేష్ బాబు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ ఎస్టేట్ కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) ధర్మ చంద్రా రెడ్డి, కడప నగరపాలక కమీషనర్ లవన్న, అసిస్టెంట్ కలెక్టర్ వికాస్ మర్మాట్, కర్నూల్ డిఐజి వెంకట్రామిరెడ్డి, కడప డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఎస్.బి.డీఎస్పీ రతన్ కుమార్, జిల్లా ఫైర్ అధికారి భూపాల్ రెడ్డి, కమలాపురం, వల్లూరు తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *