ప్రొద్దుటూరు, ఖాజీపేట అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీశాఖ సంయుక్త దాడుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8మంది స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. వీరిలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఫకృద్ధీన్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఫకృద్దిన్ పై గతంలో జిల్లాలో 71 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ల నుంచి 55 ఎర్రచందనం దుంగలు, 4 కార్లు, రూ. 9.50 లక్షలు నగదు, ఒకబైకు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సబ్ డి.ఎఫ్.వో వివేక్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్ రావు, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ పాల్గొన్నారు.
