మైదుకూరు పుర‌పాలక ఛైర్మ‌న్‌గా మాచ‌నూరు చంద్ర

133 Viewsమైదుకూరు పుర‌పాలక ఛైర్మ‌న్‌గా వైకాపాకు చెందిన మాచ‌నూరు చంద్ర ఎన్నిక‌య్యారు. సాయినాథ‌పురం తొమ్మిదో వార్డు నుంచి ఎన్నికైన చంద్ర‌ను ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ కోసం నిర్వ‌హించిన స‌మావేశంలో స‌భ్యులు ఛైర్మ‌న్‌గా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మ‌న్‌గా తొమ్మిదో వార్డు సభ్యుడు షేక్ మ‌హ‌బూబ్ ష‌రీఫ్‌ను ఎన్నుకున్నారు. చంద్ర తెదేపా హ‌యాంలో మార్కెట్ క‌మిటి ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఆర్టీసీ నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్ గౌర‌వాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు.

Continue Reading

సర్పంచిగా వైఎస్సార్‌

138 Viewsఎర్రగుడి శ్రీనివాసులురెడ్డి . వయస్సు పాతికేళ్లు. స్వగ్రామం మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం మొరాయిపల్లె. కడప కేఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్ కళాశాలలో బిటేక్ చదివారు. తండ్రి వెంకటరమణారెడ్డి వ్యవసాయదారుడు. పంచాయతీ ఎన్నికల్లో స్ధానిక రాజకీయ పార్టీల నేతల మద్దతు లేకున్నప్పటికీ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. ఏకంగా 654 ఓట్లు సాధించి పల్లె జనాల్లో తనకున్న అభిమానం ఏపాటిదో నిరూపించి రుజువు చేసుకున్నారు. ప్రజాభిమానం ఉంటే ఏ నాయకుడి సహకారం లేకున్నా విజయం సాధించవచ్చునని నిరూపించుకున్నారు శ్రీనివాసులురెడ్డి. […]

Continue Reading

అపాచీ పరిశ్రమతో రెండు వేల మందికి ఉపాధి: ముఖ్యమంత్రి

432 Views పులివెందులలో అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అపాచీ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. రూ.70 కోట్లతో రెండు దశలలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా రెండు వేల మందికి ఉపాధి దొరకనుంది. 27.94 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. ఆంధ్ర ప్రదేశ్, తైవాన్ ప్రభుత్వం కలిసి నేడు […]

Continue Reading

హోంగార్డుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

267 Viewsకోవిడ్ 19, నివర్ తుఫాను సమయంలో హోంగార్డుల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు. ఆదివారం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హోంగార్డులు ప్రతి కార్యక్రమంలో మేము సైతం అంటూ విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు. హోంగార్డు ఆర్గనైజేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి […]

Continue Reading