ysrkadapa

వార్తలు

ముఖ్యమంత్రి రెండురోజుల పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జిల్లాలో ఈరోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందుల సమీప భాకరాపురానికి చేరుకుంటారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ఏపీ కార్ల్‌కు చేరుకొని క్షేత్ర పరిశీలన చేయనున్నారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం అక్కడి నుంచి హెలికాప్టర్లో వేంపల్లికి బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు, జిల్లా పరిషత్ బాలబాలికల పాఠశాల భవనాలు ప్రారంభించి అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని బస చేస్తారు.

శుక్రవారం వైఎస్సార్‌ ఘాట్‌ చేరుకుని ప్రార్థనలు నిర్వహించి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలు దేరనున్నారు.