Tuesday, February 27, 2024

బాలికల జూనియర్‌ కళాశాల స్థాయికి ఉన్నత పాఠశాల

రూ.1.44కోట్లతో బాలికల ఉన్నత పాఠశాలకు తరగతి గదులకు భూమిపూజ మైదుకూరు అనకుంటలో బాలికల ఉన్నత పాఠశాల కోసం రూ.1.44కోట్లతో నిర్మించబోయే 12తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి భూమిపూజ చేశారు. ఈసందర్భంగా వీఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మె మాట్లాడుతూ తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, ప్రహరీ గోడ ఏర్పాటు చేయించి పాఠశాల అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో బాలికల పాఠశాలను జూనియర్‌ కళాశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గానికి రూ.30కోట్లు రెండోవిడత నాడు-నేడు కింద మంజూరైనట్లు వివరించారు. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి ని వంద పడకల ఆసుపత్రిగా రూ. 34 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 24న చిన్నయ్య గారిపల్లెలో అర్బన్ హెల్త్‌ సెంటరును ప్రారంభిస్తామనానరు. సరస్వతి పేట సమీపంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటరున రెండు నెలల్లో పారంభిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఏనియోజకవర్గానికి లేని విధంగా మైదుకూరు నియోజకవర్గానికి రూ. 72 కోట్ల పంట బీమా మంజూరైనందనానరు. కార్యక్రమంలో ఎస్‌.ఎస్‌.ఏ అదనపు పీడీ అంబవరం ప్రభాకర్ రెడ్డి, పురపాలక చైర్మన్ మాచనూరు చంద్ర, వైస్ చైర్మన్ షరీఫ్, ఎంఈఓ పద్మలత ,బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ రాముడు, వి ఆర్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఎస్ వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular