చక్రాయపేట మండలం గండిలో 16వ శతాబ్ధం నాటి తెలుగు శాసనాన్నిగుర్తించారు. నూతన ఆలయ నిర్మాణం కోసం పాత ఆలయాన్ని తొలగించి స్థలాన్ని విస్తరించడంలో భాగంగా కొండ శిలలను తొలగిస్తూ ఉండగా వేదపండితుడు రామ్మోహన్ ఆంజనేయస్వామి రూపం గల శిల్పం, సీతారాములు, గణపతి శిల్పాలను, శాసనాన్ని గుర్తించారు. వీటిని కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయ ఉద్యోగి డాక్టర్ చింతకుంట శివారెడ్డి కి పంపగా ఆయన మైసూరులోని పురావస్తుశాఖ సంచాలకులు కె.మునిరత్నంరెడ్డికి పంపారు. లిపి తెలుగుభాషలో ఉందని, 16వ శతాబ్దం నాటిదిగా గుర్తించారు. కొండునాయక కుమారుడు బాలకొండ తన తల్లిదండ్రులు పుణ్యం కోసం గండి వద్ద హనుమంతుడిని ప్రతిష్టించినట్లుగా రికార్డు చేసినట్లుగా శాసనంలో ఉందన్నారు.