దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన అచ్చమ్మగారి నాగమ్మ నిజాయితీ చాటుకుంది. తనకు దొరికిని 3.5తులాల బంగారు నగను ఎస్సై నాగరాజుకు అప్పగించి ప్రశంసలు అందుకుంది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన రాజమ్మగారి గౌనియా బేగం ఈనెల 17న దువ్వూరులో 3.5తులాల బంగారు నగను పోగొట్టుకుంది. వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింద. నాగమ్మ తనకు దొరికిన బంగారు ఆభరణాన్ని పోలీస్ స్టేషన్ చేరుకుని ఎస్సై రాజుకు అప్పగించింది. రజియాను పిలిపించి నాగమ్మ చేతుల మీదుగా బంగారు అభరణాన్ని అప్పగించేలా చేశారు. నిజాయితీగా వ్యవహరించిన నాగమ్మను పోలీసు సిబ్బందితోపాటు ఎస్సై అభినందించారు. నగదు బహుమతితో సత్కరించారు.