nivar cyclone

“నివర్” సర్వసన్నద్ధం

వార్తలు
214 Views

“నివర్” తుఫాన్ను ఎదుర్కొనేందుకు మండల స్థాయి అధికారులు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీసీ హాలు నుంచి “నివర్” తుఫాను ముందస్తు జాగ్రత్తలు, సచివాలయాల ద్వారా అందించే రెవెన్యూ సేవలు, బయో మెట్రిక్ హాజరు వంటి అంశాలపై జేసీ సాయికాంత్ వర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. తుఫానుతో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జిల్లా, డివిజన్, మండల స్థాయి వరకు ఉన్న రెవిన్యూ అధికారులతో పాటు శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ 08562 – 245259 ఏర్పాటు చేశామన్నారు. అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ సిబ్బందిని తుఫాను సహాయక చర్యలకు సిద్ధం చేయాలన్నారు. పీఆర్, ఆర్ & బి, గ్రామీణ నీటి పారుదల శాఖ, ట్రాన్స్కో, రెవిన్యూ, వ్యవసాయ వాటి అనుబంధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటి వసతి విషయంలో సంబందిత అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు.

సచివాలయాల సేవలు విస్తృతం చేయాలి : జేసీ సాయికాంత్ వర్మ

గ్రామ స్థాయిలో దేవాలయాలుగా భావించే.. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే అన్ని రకాల సేవలను తెలిసేలా .. సేవల వివరాలతో కూడిన జాబితాను సచివాలయ కార్యాలయాల ముందు ఏర్పాటు చేయాలన్నారు. రైస్ కార్డులు,. పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఇంటి స్థలాలు తదితర దరఖాస్తులను సచివాలయాల్లోనే ప్రజలు నమోదు చేసుకునేలాగ అవగాహన పెంచాలన్నారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న అన్నిరకాల దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సర్వే చేసి సంపూర్తి చేయాలన్నారు. స్పందన పిటిషన్లపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. కొత్త రైస్ కార్డుల పంపిణీ, జనన ధ్రువీకరణ, ఇంటిగ్రేటెడ్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు, అలాగే.. పెన్షన్ కార్డులు, న్యూ రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ విషయంలో ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా చూడాలన్నారు.

జగనన్న బీమా, జగనన్న తోడు పథకాల పై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం వినియోగించే ట్రక్కుల కోసం.. కార్పొరేషన్ వారీగా యూనిట్లను కేటాయించడం జరిగిందని, ఈ నెల 27వ తేదీలోపు అన్ని మండలంలో పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పంపాలని ఎంపిడివోలను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *