Tuesday, June 6, 2023

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

విద్యకు పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అమ్మఒడి లబ్దిదారులయిన 1,87,742 మంది విద్యార్థుల తల్లులకు మంజూరైన మూడవ ఏడాది లబ్ధి మొత్తం రూ.281,61,30,000 ల మెగా చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా ఉపముఖ్య మంత్రి కుటుంబం, సమాజం.. ఏదైనా సరే వారి తలరాతను మార్చగలిగే శక్తి.. ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ కిందట రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులను తీసుకువచ్చారన్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో ఏ ఒక్క చిన్నారి కూడా బడికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతోనే అమ్మ ఒడికి రూపకల్పన రూపకల్పన చేశారన్నారు. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. విద్యాదానం అనంతమైనదని, దానం చేస్తున్నకొద్దీ.. విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లీ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకావాలన్నారు. పిల్లల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తల్లులకు సూచించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం వరకే ప్రభుత్వ బాధ్యతని, ఆ పథకాల ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రధాన బాధ్యత అధికారులదేనన్నారు. నాడు-నేడు ద్వారా ప్రతి పాఠశాలలో 10 రకాలయిన మౌలిక వసతులు కల్పిస్తూ.. విద్యార్థుల చదువు కోసం మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నారు. పిల్లల విద్యాభివృధ్ధి కోసం ప్రతి తల్లీ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతిరోజూ పిల్లల చదువు పర్యవేక్షణకు కొంత సమయం కేటాయించాలన్నారు. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందుతుందని, తద్వారా ఆయా కుటుంబాలు విద్యతోపాటు, ఆర్ధికంగా వృద్ది చెందుతాయన్నారు. డ్రాప్ ఔట్స్ శాతం కూడా పూర్తిగా తగ్గుతుందనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డా.సుధ, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ అభివృద్ధి సలహాదారు రాజోలు వీరారెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్ పర్సన్ జి.రమణమ్మ, పాఠశాల విద్య ఆర్జేడీ వెంకట కృష్ణ, ఎస్.ఎస్.ఏ. పివో ఎ. ప్రభాకర్ రెడ్డి, డిఈవో దేవరాజు, ఇంటర్మీడియెట్ విద్య ఆర్.ఐ.ఓ. ఎస్.వి. రామణరాజు, డివిఈవో జి. శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular