పేరు : రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి.
గ్రామం : రెడ్డివారిపల్లె.
జననం: 1933 అక్టోబరు 20
తల్లిదండ్రులు: ఓబులమ్మ, గుర్విరెడ్డి
భార్య: హేమలతమ్మ
సంతానం: ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. (పెద్దకుమారుడు రమేష్‌కుమార్‌రెడ్డి మాజీ శాసనసభ్యుడు,
(రాజగోపాల్‌రెడ్డి కుమారుల్లో మొదటివారైన రమేష్‌కుమార్‌రెడ్డి 1999లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఓటమిని చవిచూశారు. మరో కుమారుడు శ్రీనివాసులరెడ్డి క్లాస్-1 కాంట్రాక్టరు, కుమార్తె రాధ. రాధ భర్త ఐజీగా పనిచేస్తున్నారు.)
విద్యాభ్యాసం : 1938 నుంచి 1943వరకు లక్కిరెడ్డిపల్లెలోని ప్రాధమిక పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి 9వతరగతి వరకు రాయచోటిలోని ఉన్నత పాఠశాలలోనూ, ఎస్ ఎస్ ఎల్‌సీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో చదువుకున్నారు. 1954లో అనంతపురంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు.
పదవులు: 1954 నుంచి 1956వరకు కర్నూలునీటిపారుదల శాఖలో ఇంజనీర్‌గా పనిచేశారు. 1956-57లో కృష్ణా జిల్లా ఉయ్యూరు ఇంజనీరింగ్ కళాశాలలో అద్యాపకుడిగా పనిచేశారు.
1962లో 2009లో రద్దు అయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి ఓటమి చవి చూశారు. 1967, 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1983,1985లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1989 ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొందారు. 1994లో ఓటమి చెందారు. 1973 జనవరి15వతేదీన పీవీనరసింహారావు మంత్రివర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రాజగోపాల్‌రెడ్డి 18వతేది వరకు మాత్రమే బాధ్యతలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రపతి పాలన రావడంతో మంత్రి మండలి రద్దు అయ్యింది. 1984 అక్టోబరు 17వతేదీన ఎన్టీఆర్ మంత్రి వర్గంలో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1985మార్చి 9వతేదీ వరకు విధులు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా 1985 మార్చి 09వతేది నుంచి 1989 జులై 11వతేదీ వరకు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రులుగా ఉన్న పీవీనరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మిత్రుడు.
కృషి: లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, కుషాతి, బుగ్గవంక, కాలేటివాగు, గంగనేరు, చిన్నపోతులవారిపల్లె రిజర్వాయర్ల నిర్మాణం కోసం కృషిచేశారు. మదిలోని పింఛన్ల పథకాన్ని ఎన్టీఆర్‌కు వివరించి లక్కిరెడ్డిపల్లె బహిరంగసభలో ప్రకటించేలా చేశారు.
జిల్లాలో సీనియర్ నాయకుడైన లక్కిరెడ్డిపల్లెకు చెందిన రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి 2013 సెప్టెంబరు 18వతేది తెల్లవారుజామున తిరుపతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు.