పేరు: షేక్ బేపారి రహంతుల్లా
కలంపేరు: శశిశ్రీ
పుట్టిన తేది: 1957 డిసెంబరు 6
గ్రామం: సిద్ధవటం
వృత్తి: పాత్రికేయరంగం
విద్య: పట్టభద్రులు (బీకాం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1978)
ప్రత్యేకతలు: విద్యార్థి దశలో (1974-77) మనోరంజని లిఖిత మాసపత్రికను నడపడం
శిష్యరికం: పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, పేరాల భూతశర్మ, వైసీవీరెడ్డి, డాక్టర్ గజ్జెల మల్లారెడ్డి, డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి వద్ద శిష్యరికం చేశారు
ప్రశంసలు: రాయలసీమ జన జీవితాన్ని ప్రతిబింబించేలా రాతిపూలు కథనం (1996)విమర్శకుల ప్రశంసలు పొందింది.
రచనలు: పల్లవి (వచనకావ్యం-1978), శబ్దానికి స్వాగతం (కవితా సంపుటి-1991), సీమగీతం (పద్యకావ్యం సప్తస్వరాలు-1994), జేబులో సూర్యుడు (2006), దహేజ్ (2007), మన కడప(2007) వీరి రచనలు.
సత్కారాలు: 2011లో చాసో కథాపురస్కారం-2010లో ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2008లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పట్టాభి రామిరెడ్డి లిటరరీ అవార్డు-2007లో ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు.
సేవలు : యోగివేమన విశ్వ విద్యాలయంలో 2008-2011వరకు పాలకమండలి సభ్యులుగా కొనసాగారు.
తాళ్లపాక అన్నమాచార్యుని నాటి సామాజిక జీవనం, పదాల్లో మాండలిక పద ప్రయోగాలు, పాటల్లో సామాజిక జీవన దృశ్యీకరణ, ప్రబంధాల్లో అన్నమాచార్యుని ప్రభావం వీరి పరిశోధనాత్మక పత్రాలు ప్రతిభకు మచ్చుతునకలు.
అభ్యుదయ కవిత్వం దళిత, మైనార్టీ కవిత్వాలపై వెంకటేశ్వర, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థుల పరిశోధక గ్రంధాల్లో సముచిత స్థానం కల్పించారు.