ysrkadapa

వార్తలు

తెదేపా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి విజయం ఖాయం

తెదేపా కడప పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్లమెంట్ పరిధిలోని తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. కడప నగరంలోని ఆయన కార్యాలయం లో శుక్రవారం శ్రీనివాస రెడ్డిని (వాసు) కలుసుకుని శాలువాకప్పి పూలమాల వేసి సత్కరించారు. మిఠాయి తినిపించారు. ఈసందర్బంగా రెడ్యo మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక తెదేపా శ్రేణుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజానేతగా ఎదిగిన శ్రీనివాసరెడ్డి గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో తెదేపా నేతలు తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతం రెడ్డి శివారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి అమర్నాథ్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.