ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు

612 Viewsవెలదులకును వేదవిద్యాధికారమ్ము లేదటంచు బ్రహ్మలిఖితమంచు నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ!హంస!కాళికాంబ! ప్రాచీన, మధ్యయుగాలలో స్త్రీలకు చదువు కునే అర్హత లేకుండా చేసిన దుర్మార్గం మీద ఈపద్యంలో వీరబ్రహ్మంగారు విమర్శ పెట్టారు. స్త్రీలకు వేద విద్య నభ్యసించే అర్హత లేదనీ అది బ్రహ్మ రాసినరాత అనీ ప్రచారం చేస్తూ ఆవిద్యకు అధినేత్రి అయిన నిన్ను మరచిపోయినారమ్మా వాణీ అని వీరబ్రహ్మంగారు సరస్వతికి గుర్తు చేశారు. భారతీయ సామాజిక వ్యవస్థలలో ముఖ్యమైన విద్యావ్యవస్థలోని అసంబద్ధతను అన్యాయాన్నీ వీరబ్రహ్మంగారు […]

Continue Reading

దుష్టులు గురువులా?

788 Viewsచీకుమబ్బులోన జీరాడు జీవికి చొక్కమైనదారి చూపువాడె గురుడుగాని గుండగొయ్యలు గురువులా కాళికాంబ!హంస!కాళికాంబ కటికచీకట్లో దిక్కుతెలియక తిరుగుతున్న మనిషికి సరైనదారి చూపించేవాడు గురువు గానీ దుష్టులు గురువులా? బ్రహ్మంగారి కవిత్వం గురు సంప్రదాయానికి చెందినది. ఆయన కవిత్వంలో గురువుకు ఎనలేని స్థానముంది. గురువులలోకూడా మంచి గురువులను చెడ్డగురువులను గుర్తించారాయన. ఎలాంటి వ్యక్తి నిజమైన గురువో ఈ పద్యంలో చెప్పారు.  దారితెలియక తిరిగే వ్యక్తికి చొక్కమైన దారి చూపించేవాడే గురుశబ్దానికి తగినవాడు. గుండగొయ్య అంటే దుర్మార్గులు గురువులుకాదు అని […]

Continue Reading

వినయం వల్లే చదువు

891 Viewsచదువకొన్నఫలము కుదరైన వినయమ్ము వినయఫలము వేదవేది యగుట వేదవేదిఫలము విశ్వమ్ము తానౌట కాళికాంబ!హంస!కాళికాంబ చదువు వలన ఫలితం మనిషిలో వినయం కలగడం,  వినయం వలన ఫలితం వేదవేది కావడం,  వేదవేది కావడం వలన ఫలితం విశ్వమే తాను కావడం. ఈపద్యంలో బ్రహ్మంగారు చదువు, దాని ప్రయోజనం, దాని పరిణామం క్లుప్తంగా తెలియజేశారు. ఒకదేశం గొప్పతనాన్ని నిర్ణయించే అంశాలలో ఆదేశంలో విద్యావంతుల సంఖ్య ముఖ్యమైనది. 17వ శతాబ్దంలో మనదేశంలో విద్యావంతుల సంఖ్య అత్యల్పం. వాళ్ళు ఎవరు అనేది […]

Continue Reading

యోగికి గుణం ముఖ్యం

774 Viewsస్నానమందు లేదు పానమందును లేదు మంత్రతంత్రములను మహిమలేదు గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను కాళికాంబ!హంస!కాళికాంబ. యోగి కావాలంటే దానికి సంబంధించిన గుణం కుదరాలి. అంతేగానీ స్నానపానాలలో, మంత్రతంత్రాలలో ఏమహిమలూ లేవు అంటున్నారు బ్రహ్మంగారు. యోగికి బాహ్య విషయాలు ముఖ్యంకాదు. గుణం ముఖ్యం. యోగి గుణం అంటే ఆడంబరాలతో సంబంధంలేని చింతన, నిరాడంబరమైన ఆచరణ, మనుషులపైన నిష్కల్మషమైన ప్రేమ, సమాజ పరివర్తనా దృష్టి , స్వార్థరాహిత్యం వంటి లక్షణాల సమూహం. వీటిని వదిలేసి మంత్రాలు తంత్రాలు విచిత్రవేషాలు […]

Continue Reading