భక్తి లేకుండా జ్ఞాన ఫలం లభించదు

324 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి. “ఏదీ తనంతతానై నీదరికి రాదు, […]

Continue Reading

కొంపలు కూల్చే కులం

864 Views“కులమనేటి తెగులు కొంపలు గూల్చును చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ!హంస!కాళికాంబ!” కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ చంపగలిగినవాడు గురువైన విప్రుడు. వేలయేళ్ళుగా భారతదేశాన్ని శాసిస్తున్న కులవ్యవస్థ సృష్టించిన విధ్వంసాన్ని అందులోని నిరంకుశత్వాన్ని కళ్ళారా చూశారు బ్రహ్మంగారు. అలాగే చలం మితంమాలిన స్వార్థం అనేరోగంతో మనుషులు సతమతం కావడం అది సృష్టించిన విధ్వంసాన్ని కూడా ఆయన గమనిం చారు. ఈరెండు […]

Continue Reading

నిర్భాగ్యులు

329 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో బ్రహ్మంగారు ఈపద్యం ద్వారా ముందు వరసలో నిలబడ్డారు. మనిషి తనజీవితం సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవడం అందుకు అవసరమైన సంపదను సమకూర్చుకోవడం తప్పుకాదు. ఇది భౌతిక జీవితానికి సంబంధించిన  కోరిక. ఇది నెరవేరాలంటే భౌతికంగానే ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయాలి. నియమబద్ధమైన జీవితం […]

Continue Reading

సజ్జనుడు-దుర్జనుడు

893 Viewsసర్వదేవతలను సర్వమతాలను సమముగా జూచు సజ్జనుండు దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు కాళికాంబ!హంస!కాళికాంబ మంచిమనిషి అందరు దేవుళ్ళను అన్నిమతాలను సమానంగా తెలుసుకుంటాడు. చెడ్డమనిషి వాటిలో దోషాలు లెక్కబెడతాడు. వీరబ్రహ్మంగారు భారతదేశంలో అనేక దేవతారాధన వ్యవస్థ, అది సృష్టించే సామాజిక సంఘర్షణ, అనేక మతవ్యవస్థ అది సృష్టించే ఉత్పాతం…వీటిని జాగ్రత్తగా పరిశీలించారు. మతాలూ దేవతారాధనలూ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. దీనివల్ల మనుషుల మధ్య చీలికలూ గొడవలూ జరుగుతున్నాయి. వీటిచుట్టు స్వార్థపరులు చేరి వత్తిని ఎగదోసి పబ్బంగడుపుకోవడమూ ఆయన […]

Continue Reading