మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్ర పరిశోధకుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తవ్వా ఓబుల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారానికి ఎంపికయ్యారు. గ్రామీణ రైతుల జీవన స్థితిగతులు, రాయలసీమ సాంస్కృతిక జీవనం. విద్యావ్యవస్థ. రాజకీయ పరిస్థితులపై కథలు రచించారు. కడుపాత్రం, ముంపు, నవ వసంతం, ఉచ్చు, కేరింత, సూతకం కథలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. గండికోటపై పరిశోధనాత్మకమైన పుస్తకాన్ని రచించారు. 2013లో ఉత్తమ రచయిత అవార్డు అందుకున్నారు. వెంకటరామాపురం సమీపంలో బుద్ధుని పాదముద్రికలను వెలుగులోకి తెచ్చారు. 2013లో ఉత్తమ పర్యాటక రచయిత అవార్డు, 2016లో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. గిడుగు రామమూర్తి ఫౌండేషన్ చే 2019లో సాహితీ కళా సేవా పురస్కారాన్ని అందుకున్నారు.